పవన్‌కల్యాణ్‌ ఓ దొంగ

– పీఆర్పీని ముంచి మంత్రి పదవి తీసుకున్న చరిత్ర విూదికాదా..?
– తనను తాను రక్షించుకొనేందుకు జగన్‌ పాదయాత్ర
– చంద్రబాబు ఆదేశిస్తే జగన్‌పై నేను, పవన్‌పై నా కుమార్తెను నిలబెడతా
– తెదేపా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌
విజయవాడ, జులై10(జ‌నం సాక్షి) : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పవన్‌, జగన్‌, కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. పవన్‌కల్యాణ్‌ ఓ దొంగ అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసిందేనన్నారు. ‘పీఆర్పీని ముంచి మంత్రిపదవి తీసుకున్న చరిత్ర విూది కాదా? అని నిలదీశారు. ప్రధాని మోదీ ముగ్గురు దొంగలతో కలిసి అధికారం కోసం ప్లాన్‌ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ రాష్ట్రానికి సైతాన్‌లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాను రక్షించుకొనేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిస్తే కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేస్తానన్నారు. అలాగే జగన్‌పై మా కుమార్తె
పోటీ చేస్తుందని జలీల్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రత్యేక ¬దా ఇస్తామని చెప్పిన కేంద్రం ఏపీ ప్రజలను నిలువునా ముంచిందన్నారు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఏపీలో అభివృద్ధి కుంటుపండేలా చేస్తుందన్నారు. కేంద్రం ఏపీపై కక్షపూరిత ధోరణిలో వెళ్తున్నా జగన్‌, పవన్‌లు ఒక్క మాటకూడా మోదీని నిలదీయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా కేంద్రాన్ని నిలదీసే చంద్రబాబును తిట్టేందుకు రోజూ జగన్‌, పవన్‌లు రోడ్లపైకి వెళ్తున్నారన్నారు. బీజేపీ చెప్పు చేతల్లో జగన్‌, పవన్‌లు పనిచేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. ఇప్పటికైన జగన్‌, పవన్‌లు తమ తీరును మార్చుకొని ప్రత్యేక ¬దాపై మోదీని నిలదీయాలని సూచించారు.