Monday, 2 November 2026

వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన కోదండరామస్వామి ఆలయం

వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన కోదండరామస్వామి ఆలయం

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అర్చకులు

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి(1): నూతన సంవత్సరంలో మొదటి వైకుంఠ ద్వార దర్శనానికి మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆలయ అర్చకులు రంగాచార్యులు ఆలయంలో కొలువుదీరిన సీతారామస్వామి విగ్రహాలకు అన్ని రకాలుగా సుందరంగా తీర్చిదిద్దడంతో స్వామివారు భక్తులను ఎంతో ఆకట్టుకోనున్నారు నూతన సంవత్సరంలో మొదటి సోమవారం వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులకు తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ కోదండరామస్వామి వైకుంఠ ద్వారంలో భక్తులకు దర్శనం ఇస్తారని అర్చకులు రంగాచార్యులు తెలిపారు అందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కోదండరామస్వామి అనుగ్రహం పొందాలని అర్చకులు కోరారు