పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం
స్కూలు విద్యార్థిని నిర్బంధించి లైంగికదాడి
ఏలూరు,జూలై27(జనం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని ఇద్దరు యువకులు మూడురోజుల పాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కిరణ్, చిట్టిబాబు అనే యువకులు విద్యార్థినికి మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి సవిూప గ్రామమైన కవ్వగుంటకు తీసుకెళ్లి నిర్బంధించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దెందలూరు మండలం దుగ్గిరాలకు చెందిన విద్యార్థినిని స్వగ్రామానికి తీసుకెళ్తామని మాయమాటలు చెప్పిన యువకులు కవ్వగుంటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలిక కనిపించడం లేదంటూ వసతిగృహం సంరక్షణాధికారి రెండురోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఈ ఘటన వెలుగుచూసింది. బాలికను కవ్వగుంట గ్రామంలో ఉన్నట్లు పోలీసులు గురువారం కనుగొన్నారు. యువకులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.