పెషావర్ : పాకిస్థాన్‌లోని పెషావర్ ప్రాంతంలో స్వాబి జిల్లాలో ఏడుగురు వ్యక్తుల్ని గన్‌మెన్లు కాల్చి చంపారు. సమాజ సేవ చేసే ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఓ కమ్యూనిటీ సెంటరులో సేవలందించి తిరిగివెళ్తూ గన్‌మెన్ల తుటాలకు బలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉపాధ్యాయినులుగా పనిచేస్తున్నారని స్వాబి జిల్లా అధికారులు తెలియజేశారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.




