ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో షియా ముస్లిం వరం వూరేగింపులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా .. 17 మంది గాయపడ్డారు. ఖైబర్-పక్తుంఖ్వా ప్రాంతంలోని డిఖన్ టోపన్‌వాల్‌లో మొహర్రం సందర్భంగా ముస్లింలు వూరేగింపు చేపట్టారు. ఈ మార్గంలో ముష్కరులు బాంబును అమర్చి రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మరోవైపు తాలిబన్ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాక్ ప్రభ్వుతం భద్రతనే కట్టుదిట్టం చేసింది.




