Tuesday, 3 November 2026

విద్యార్థులు అన్నిరంగాలలో రాణించాలి

.మల్కాజిగిరి.జనంసాక్షి.జున్ 28విద్యార్థులు చదువు తో పాటు అన్ని రంగాలలో రాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు కవి రచయిత తులసి వెంకట రమణా చార్యులు పేర్కొన్నారు.బుధవారం అక్షర కౌముది సంస్థ దాతల సౌజన్యంతో  నేరేడ్ మెట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల,భగత్ సింగ్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్, పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ.సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ఎప్పుడు ముందుంటుందన్నారు.అలాగే నేటి బాలలే రేపటి పౌరులు విద్యార్థుల భవితను నిర్దేశించే శక్తి కేంద్రాలు పాఠశాలలు అని అన్నారు.తమ సంస్థ గత నాలుగు సంవత్సరాలుగా సాహిత్య,సామాజిక సాంస్కృతిక రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్స్ అందచేసామని అన్నారు.దాతల సహకారంతో నేరేడ్ మెట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న150 మంది విద్యార్థులకు,భగత్ సింగ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్,పెన్ పెన్సిల్,బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు.సంస్థ ఆధ్వర్యంలో మును ముందు విద్యార్థులకు అనేక పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకుబహుమతులు అందజేస్తూ
విద్యార్థులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన పాఠశాల అధ్యాపక బృందం అందరికీ సంస్థ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ మాట్లాడుతూ.ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉంటారు వారికి ప్రభుత్వం పరంగా కొన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ఇంకా మెర�