టేకులపల్లి, జనవరి 25( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు లక్ష్మణ్ విద్యార్థులకు జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వల్ల కలిగే ప్రయోజనాలపై, దేశ రాజకీయ చరిత్రలు మార్చే ఓటు విలువ తెలియజేసేందుకు ఓటు హక్కు వినియోగం గురించి వివరించారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించుటకు వారి స్థాయికి తగ్గట్టుగా వ్యాసరచన,చిత్రలేఖనం, రంగురంగుల చిత్రలేఖనం వేయించారు. ఓటు గురించి ప్లే కార్డుల ద్వారా ప్రదర్శించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, రవీందర్, పద్మ, సుజాత, రమాదేవి పాల్గొన్నారు.




