Wednesday, 4 November 2026

పాఠశాల ప్రగతికి ఆడ గ్రామస్తుల చేయూత

పాఠశాల ప్రగతికి ఆడ గ్రామస్తుల చేయూత
జైనథ్ జనం సాక్షి నవంబర్ 29
జైనత్ మండలంలో ఆడ గ్రామస్తులు పాఠశాల ప్రగతి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆడ గ్రామస్తులు మరియు పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పాఠశాల అభివృద్ధి పరచడానికి గ్రామస్తుడు బేర వెంకన్న తమ వంతు సాయంగా పాఠశాల అభివృద్ధి కై పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఆడ గ్రామ సర్పంచ్ పాయల్ శరత్ వెంకన్న గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భూమన్న యాదవ్ వైస్ చైర్మన్ లత గ్రామస్తులు కో రెడ్డి వెంకన్న సీతారాం దత్తు సుభాష్ దేవన్న విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.