Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ధర్మపురి పుణ్య స్నానాలకు వెళ్తూ ఆటో బోల్తాపడిన సంఘటనలో గాయపడిన బాధితులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా బాధితులను మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించి, ప్రమాద సంఘటనపై ఆరా తీశారు. ప్రమాదకరమైన మూల మలుపూ వద్ద రోడ్డును మరింత వెడల్పు చేసి, ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలనీ జీవన్ రెడ్డి అన్నారు.