జలంధర్ : పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని గహీర్ గ్రామంలో ఈ ఉదయం అకాల్ అకాడమీ పాఠశాల బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జలంధర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 35 మంది విద్యార్థులను బస్సులో పాఠశాలకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలిలోనే ఏడు మంది విద్యార్థులు మృతి చెందగా.. నలుగురు ఆసుపత్రికి తరలించిన అనంతరం చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.




