పాఠశాల విద్యార్తినులకు స్కూల్ బ్యాగుల పంపిణీ,
కొమురం భీం జిల్లా: చింతలమానేపల్లి మండలం: డిసెంబరు 24 (జనం సాక్షి) శనివారం మండల కేంద్రంలోని పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా చింతలమానేపల్లి మండలంలో గల కస్తూరిబా పాఠశాల విద్యార్థినులకు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ చేతుల మీదుగా 150 స్కూల్ బ్యాగులు విజన్ కాలేజ్ మంచిర్యాల వారి సహకారంతో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ
కృషి ,తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్య సూత్రాలని విద్యార్థినులకు తెలిపారు,చదువుకు పేదరికం అడ్డురాదని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో డిఎస్పి కరుణాకర్ ,సిఐ బుద్దే స్వామి, కస్తూరిబా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి శ్రీజా నందిని, ఎస్సై గుంపుల విజయ్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




