Thursday, 5 November 2026

పాఠశాల స్థాయిలోనే పిల్లలకు విలువల ఆధారిత బోధన ఎంతో అవశ్యకం

పాఠశాల స్థాయిలోనే పిల్లలకు విలువల ఆధారిత బోధన ఎంతో అవశ్యకం
– జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ నవంబర్ 17 (జనం సాక్షి): పాఠశాల స్థాయిలోనే పిల్లలకు విలువల ఆధారిత బోధన ఎంతో అవశ్యకమని హుజూర్ నగర్
జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు.
గురువారం మండలంలోని అమరవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రధానోపాధ్యాయులు పి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సూరజ్ పబ్బతి అనే ఎన్నారై స్థాపించిన పీపుల్స్ ఫర్ ఇండియా (పి ఎఫ్ ఐ) అనే సంస్థ స్థానిక పాఠశాలకు 12,000 వేల విలువచేసే పోర్టబుల్ మైక్ ను బహుకరించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి, ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి లు హాజరైనారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ పిఎఫ్ఐ సంస్థ భారతదేశంలోని ప్రభుత్వ గ్రామీణ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేలా వివిధ రకాల నైపుణ్యాలను, విలువలను పెంపొందించడానికి పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి వారు చేస్తున్న కృషి చాలా అభినందనీయమని వారికి తమ గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల తోపాటు విలువలతో కూడిన సమాజ స్థాపనకు నైతిక ఆధ్యాత్మిక సామాజిక ఆర్థిక విలువలను పెంపొందించే బృహత్తర బాధ్యతను నిర్వర్తించాలని పాఠశాల స్థాయిలోనే పిల్లలకు విలువల ఆధారిత బోధన ఎంతో అవశ్యకం అని తెలియజేశారు. ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలోనే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకొని కఠిన సాధనతో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. సర్పంచ్ సుజాత మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎదగాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ప్రసంగిస్తూ ఉన్నత సమాజా నిర్మాణానికి పౌరులు ఉన్నత విలువలు పాటించడమే మూలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కందుల వీరస్వామి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, యాదగిరి, శ్రీనివాసరావు, బ్రహ్మచారి, బాల సైదులు, మంజుల, విజయనిర్మల, గ్రామ పెద్దలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.