పేదలకు అండగా సీఎం సహాయనిధి
హుజూర్ నగర్ నవంబర్ 17 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని 28 వ వార్డులోని ఇంజమూరి వెంకటేశ్వర్లు అనే లబ్దిదారునికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో సీ.ఎం సహాయ నిధి నుండి విడుదలైన రూ. 44000/- వేలు చెక్కును టీ.ఆర్.ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు సమక్షంలో లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్ళి అందజేయడం జరిగిందన్నారు. గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు గొప్ప వరం సీఎం సహాయ నిధి అని అన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటి వద్దకే రావడాన్ని హర్షిస్తూ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుల గురవయ్య, మాజీ కౌన్సిలర్ నందిగామ శంభయ్య , నందిగామ ముక్కంటి, నందిగామ పాపయ్య, పార్టీ సీనియర్ నాయకులు మోదాల లక్ష్మీ నారాయణ, నందిగామ నాగయ్య, ఇంజమూరి భిక్షమయ్య, అమరబోయిన శ్రీను, బండి సీతయ్య, మోదాల సీతారాములు, గోపి తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం సహాయనిధి




