Thursday, 5 November 2026

భీం భీమికి జై సినిమా పోష్టర్ విడుదల

భీం భీమికి జై సినిమా పోష్టర్ విడుదల

నర్సంపేటకు చెందిన దర్శకులు కంజర్ల సందీప్ మొదటి చిత్రం
జనం సాక్షి నర్సంపేట
నూతన నటీనటులతో చదువువిలువ, అందరికి సమానత్వం, మరియు ఇప్పటికి మారని ఆదిపత్య ధోరణి తదితర సామాజిక అంశాలను నూతనకోణంలో చూపించే జాశ్నవి మూవిమేకర్స్ నిర్మాణం జరిగే
భీం భూమికి జైసినిమా పోష్టర్ ఆవిష్కరణ అనిల్ కూర్మాచలంతెలంగాణ సినిమా డెవలప్ మెంట్ చైర్మైన్ మరియు వి.సముద్రసీనియర్ సినీ ధర్శకులు గార్ల చేతుల మీదుగ రవీంద్రభారతి హైదరాబాద్ లో ఆవిష్కరించడం జరిగింది ఆ విష్కరణ అనంతరం మూఖ్య అతిథులగ విచ్చేసిన అనిల్ కూర్మాచలం,వి.సముద్రగార్లు మాట్లాడుతూ మంచి కథ,చేయగలిగె దమ్ము, క్రియేటివిటి ఉన్న ఎవరైన చిన్న సినిమా పెద్దసినిమా అనే తేడలేకుండ నిలదొక్కుకోవచ్చన్నారు ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు పోష్టర్ ఆవిష్కరణకు ముందు ఈ చిత్రదర్శకులు వినిపించిన కథ ఆధారంగ ఇది పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ కు అడ్వాన్స్ కంగ్రాచ్యూలెషన్స్ తెలిపారు అనంతరం ఈ చిత్రదర్శకులు సందీప్ కంజర్ల మాట్లాడుతూ నిజ-జీవితంలో సామాన్యులు నాటి నుంచి నేటివరకు ఇంకా అనుభవిస్తున్న వివక్షత,నిరక్షరాసత్య పేదరికం వంటి అంశాలను తెరకెక్కించాలనె సంకల్పంతో ఈ సినిమా చేయడం జరుగుంతుంది అని వాస్తవాలకు దగ్గరగ ఉండే ఈ మూవి ప్రతి ఒక్కరు చూడగలిగేల ఉంటుందని ఈ చిత్రంలోని పాత్రలు మన ఇంటి పరిసరప్రాంతాల వారిని చూసినట్లుగ ఇది మన కథే అను కునేల ఉంటుందని
సమస్యలనె కాకుండ పరిష్కార మార్గాల మూలలను చూపించె ప్రయత్నం జరిగిందని త్వరలొ విడుదలకాబోతుందని అందరు తప్పకుండ చూసి నూతన నటీనటులను,టెక్నిషియన్లను ఆశీర్వదించగలరని ఈ సంధర్భంగ కోరారు
పోష్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నవారు చిత్ర హీరో అభిలాష్, మ్యూజిక్ డైరెక్టర్ మహిదన్ ఎం.ఎం., కె.వి.కృష్ణారెడ్డి, నటులు ఎస్.ఎస్ రాజు, శర్మ,సుధాకర్ ,పవన్,రాకేష్,విష్ణు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.