పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి
హైదరాబాద్,నవంబర్16(జనం సాక్షి ): జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాత్రికేయులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయుల కృషి గణనీయమైందన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.