రామారెడ్డి జులై 8 ( జనంసాక్షి ) :
స్కావెంజర్లు లేక టీచర్ల ఇబ్బందులు
ఇంకా పాఠశాల గదుల్లోనే ధాన్యం బస్తాలు
వారం రోజులు ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తే ఇళ్లంతా ధుమ్ము, ధూళి చెత్తతో నిండుపోతుండ టం చూస్తుంటాం, వేసవి సెలవుల్లో బడులు నెల రోజులు మూతబడే ఉన్నాయి. గతంలో ఆన్లైన్ క్లాసులతో పిల్లలు, ఉపాధ్యాయులు బడులవైపే చూడలేదు. ఇక బడులు, అధికారుల నిర్లక్ష్యంతో ఎలా తయారయ్యో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సమస్యలను ఉపాధాయులను వేధిస్తున్నాయనే చెప్పాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యసంవత్సరంలో పాఠశాల పున ప్రారంభం దశలోనే పాఠశాలల్లో పలు సమస్యలు తిష్టవేశాయి. రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో పాఠశాలల్లో నల్లాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు పూర్తిగా పాడై శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆవరణలు మొత్తం పిచ్చిమొక్క లతో నిండిపోయాయి. దుమ్ముధూళితో కంపు కొడుతున్నాయి. బడులు శుభ్రం చేసి శానిటైజ్ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆదేశాలు తుంగ లో తుక్కుతున్నారు. అధికారులు విద్యాశాఖ చెబుతుండగా ఎక్కడా పనులు శూన్యంగా చర్య లు కనిపించడం కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్యం, శానిటైజేషన్‌కు సర్కారు నిధులు ఇవ్వకపోవ టంతో ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు ఏం చేయాలో తోచటం లేదు. బడుల్లో ఆటెండర్లు, స్కావెంజర్లు లేకపోవటంతో ఉపాధ్యాయులు కష్టంగా వీధులు నిర్వహించాల్సి వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు . దీనికి తోడు ధాన్యం బస్తాలను కూడా పలు పాఠశాలల్లో నిల్వ ఉంచటం అధికారుల నిర్లక్ష్యం అద్దంలో చూసిన ట్లుగా కనబడుతోంది. విద్యాశాఖ బడుల్లో స్కావెంజర్లను నియమించడంలేదు. దీంతో వాటిని శుభ్రం చేసే వారు లేక మూత్రశాలలు, మరుగుదొ డ్లు ఆధ్వానంగా మారాయి. జిల్లాలో పాఠశాలలు పంచాయతీల్లో భాగమని, జీపీలే బడుల పరిశుభ్ర త బాధ్యతలు చూసుకోవాలని విద్యాశాఖ ఉన్నతా ధికారులు స్పష్టం చేస్తున్నారు. పంచాయ తీరాజ్ శాఖ సైతం ఇదే విషయమై గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒక్కో జీపీలో ఒకరిద్దరు మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మరుగుదొడ్లు మూత్రశాలలు సరిగా లేక విద్యార్థులు చదువుకునే సమయంలో వారికి మలమూత్రాలు వస్తే ఎక్కడ పోయేది ఒకవేళ విద్యార్థులకు ఏదైనా సమస్యలు తలెత్తితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంద ని అంటున్నారు.




