పాదయాత్ర వెళ్లిన అయ్యప్ప సాములు
జనం సాక్షి / కొల్చారం
అయ్యప్ప ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలనే సంకల్పంతో రంగంపేట నుంచి చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లిన అయ్యప్ప స్వాములు కొల్చారం మండలం రంగంపేట గ్రామ అయ్యప్ప స్వాములు 12 మంది గురువారం చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళ్లేమన్నారు. అమ్మవారి ఆశీస్సులు మా రంగంపేట గ్రామ ప్రజలను దేశ ప్రజలను సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారన్నారు అంతేకాకుండా రంగంపేట గ్రామ ప్రజల చిరకాల కోరిక రంగంపేట గ్రామం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారన్నారు.ఈ కార్యక్రమంలో కన్నె స్వాములు రాందిన్ స్వామి ,రోహిత్ స్వామి ,నవీన్ స్వామి ,కత్తి స్వామి మల్లికార్జున్ స్వామి, గంట స్వామి యాదగిరి స్వామి, గురుస్వాములు రాచప్ప స్వామి ,పాండురంగచారి స్వామి ,మహేందర్ స్వామి ,దిలీప్ స్వామి ,సంపత్ స్వామి ,శశిధర్ స్వామి ,బొగ్గుల శ్రీనివాస్




