రాజీవ్ చౌక్ లో బిజెపి నాయకులు సంబరాలు … వనపర్తి టౌన్ : డిసెంబర్ 8 ( జనం సాక్షి ) వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ చౌరస్తాలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బిజెపి గెలిచిన సందర్భంగా, ఈరోజు రాజీవ్ చౌరస్తాలో పట్టణ ప్రధాన కార్యదర్శి సుగూరు రాములు ఆధ్వర్యంలో బాణాసంచా, కాల్చడం జరిగింది,ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుగురు రాములు మాట్లాడుతూ, గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో బిజెపి గెలుపొందడంతో బిజెపి పార్టీ నాయకులు సంతోషం వ్యక్తపరుస్తూ బాణాసంచా కాల్చడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క గ్రామానికి, ప్రజలకు తెలిసే విధంగా,కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు, రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, కుమారస్వామి,పట్టణ ప్రధాన కార్యదర్శి మామిళ్ళపల్లి రాయన్న,విష్ణువర్ధన్ రెడ్డి, D.ప్రవీణ్, జిల్లా కోశాధికారి బా శెట్టి శ్రీను , దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కుమార్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కరీం , ఓం ప్రకాష్ చారి, జ్ఞానేశ్వర్, నందిమల్ల రవి,వెంకటేష్ నాయుడు,పెద్దమారు రాము, బాలయ్య, పరశురాం,మన్యం , పికిలి వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ చౌక్ లో బిజెపి నాయకులు సంబరాలు … వనపర్తి




