Tuesday, 3 November 2026

పాప్కాపురంలో బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి

 

 

 

 

 

 

 

ఏటూర్ నాగారం(జనంసాక్షి)జూన్05. మండలంలోని పాప్కా పురంలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి విద్యార్థులను చేర్పించాలని మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై రూపొందించిన కరపత్రాలు కొమురం భీంనగర్, ప ప్కాపురం గ్రామస్తులకు పంపిణీ చేస్తూ బ్యానర్, ప్రదర్శిస్తూ ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని,ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎండి సర్వర్ అహ్మద్,ఎస్ఎంసి కమిటీ చైర్మన్ సమ్మక్క, ఇరుప రమేష్ లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని ప్రతి ఒక్కరు కి ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, అందిస్తారని పేర్కొన్నారు.మన ఊరు మన పాఠశాల అనే నినాదంతో గ్రామస్తులు అందరూ సహకరించి పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సి ఆర్ పి) శ్రీధర్ నాయక్,ఎస్ఎంసి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయురాలు సబిహ అమతూర్ రెహమాన్, అంగన్వాడి టీచర్ లలిత కుమారి,విద్యార్థులు, కొమరం భీమ్ నగర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.