రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 5. (జనంసాక్షి). తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద సోమవారం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 100 మంది మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులతో కలసి ఎస్పీ అఖిల్ మహాజన్ తోపాటు పోలీసు అధికారులు కలిసి భోజనం చేశారు. ఎస్పీ,జిల్లా పోలీస్ అధికారులు తమను గుర్తించి తమతో పాటుగా కలిసి భోజనం చేయడం పట్ల పారిశుద్ధ్య కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ కరోన విజృంభణ సమయంలో పోలీకేసులు,పారిశుధ్య కార్మికులు,వైద్య సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాలందించారని కొనియడారు.పోలీసులు సమాజంలో నేరాలు లేకుండా శుభ్రం చేస్తారని, పారిశుధ్య కార్మికులు సమాజంలో చెత్త చెదారం లేకుండా శుభ్రం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచరి,సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, ఎస్.ఐ లు మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు..
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు




