Thursday, 5 November 2026

పారిశుద్ధ్య సేవకులకు జీతాలు పెంచి ఇవ్వమని సీఎం కేసీఆర్ గారు చెప్పిన అంశాన్ని కూడా తిరస్కరించడం బాధాకరం

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 10 జనం సాక్షిప్రజల అవసరాల దృష్ట్యా, పట్టణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఎజెండాను తయారు చేయడం జరిగిందని, చివరికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పారిశుద్ధ్య సేవకులకు రూ.1000 పెంచి జీతాలు ఇవ్వమని చెప్పిన అంశాన్ని కూడా కొందరు కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం బాధాకరమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు చైర్ పర్సన్ మంజుల రమేష్అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించగా 27 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రూపొందించిన ఎజెండలోని 1 నుండి 37 అంశాలపై 18 మంది కౌన్సిలర్లు తిరస్కరించి కౌన్సిల్ హాల్ లో నుండి బయటకు వెళ్లిపోయారు. దాంతో ఈ సాధారణ సమావేశాన్ని చైర్ పర్సన్ వాయిదా వేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తన చాంబర్లో మీడియాతో మాట్లాడిన చైర్ పర్సన్ వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. కావున ముందు వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడదాం అని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు అన్నారు. నిజానికి ఎజెండా ప్రిపేర్ చేసి 3 రోజుల ముందే అందరు కౌన్సిలర్లకు ఎజెండాను ఇవ్వడం జరిగింది. పైగా మున్సిపల్ జీవో ప్రకారం ఏ బడ్జెట్ ను దేనికి కేటాయించాలో దానికి మాత్రమే కేటాయించడం జరిగింది. ప్రతి వార్డులో స్థానిక కౌన్సిలర్ల ద్వారా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వర్క్ ఇన్స్పెక్టర్లు ఎస్టిమేషన్ వేసిన తర్వాతే బడ్జెట్ కేటాయించడం జరిగింది. అయినా కూడా మీకు ఏమైనా అనుమానం ఉంటే అట్టి ప్రియాంబుల్ పై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పటికీ సదురు కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధికి ప్రధానమైన సాధారణ సమావేశాన్ని కొనసాగించడంలో సహకరించకపోవడం బాధాకరం అని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అసహనం వ్యక్తం చేశారు. వికారాబాద్ పట్టణంలో నిరంతరం జరిగే పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ఉపయోగించే వాహనాల రిపేర్, వాటర్ సప్లై విభాగంలో పైప్ లైన్ల రిపేరింగ్, మురుగునీటి కాలువల ఏర్పాట్లు, వికారాబాద్ లో మరో ప్రధాన సమస్య ఎస్ టి పి) మురుగు నీటి శుద్ధి కేంద్రం* రిపేర్లు, పారిశుద్ధ్య కార్మికుల దుస్తుల స్టిచ్చింగ్ చార్జీలు, అన్ని విభాగాల స్టేషనరీ కోసం కేటాయించిన బడ్జెట్ అంశం.. ఇలా అత్యవసర సమస్యల పరిష్కారానికై రూపొందించిన ఎజెండాను తిరస్కరిస్తే వికారాబాద్ పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కావున పట్టణ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి విషయంలో కౌన్సిలర్లు అందరూ సహకరించాలని చైర్ పర్సన్ కోరారు. ఈ మీడియా సమావేశంలో వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.