Thursday, 5 November 2026

రైతులకు టార్పాలిన్ కవర్లు పంపిణీ

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మంథని మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు టార్పాలిన్ కవర్లను పంపిణి చేయనైనది. అకాల వర్షాల వల్ల రైతులు పండించిన పంటలు తడిసిపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణఆదేశాల మేరకు గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్ లను పంపిణి చేయనైనది మరియు అకాల వర్షంతో మంథని పట్టణం లోని ఇంటి కాపు కూలిన వారికి టార్పాలిన్, డిన్నర్ సెట్, హైజినికి కిట్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐ ఆర్ సి ఎస్ పెద్దపల్లి జిల్లా వైస్ చైర్మన్ తూము రవీందర్, మంథని నియోజకవర్గ ఇంచార్జి మేడగొని వెంకటేష్, ఐ ఆర్ సి ఎస్ సభ్యులు బొడ్డు సతీష్, తాటికొండ వెంకటేష్, మీట్టు గౌడ్, శశి పాల్గొన్నారు.