బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడి గా లక్ష్మణ్ బాబు ను ఎన్నిక చేయాలి
ఏటూరునాగారం జడ్పిటిసి కి అవకాశం వచ్చిన పదవి త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి
ప్రజా సేవలో చురుకైన పాత్ర
అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ మరింత పటిష్టం
నిరుపేదల పెన్నిధి.. జిల్లా ప్రజలు నాయకులు, కార్యకర్తల మనసులో మాట
ఏటూరునాగారం(జనంసాక్షి)జులై15.
తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావo వరకు ఎలాంటి పదవులు ఆశించకుండా బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం అనునిత్యం అలుపెరగని పోరాటం చేస్తూ ములుగు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీని గడప గడపకు బలోపేతం చేస్తూ, పార్టీ ఏ జెండానే తన జెండాగా భావించి ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ప్రజా సేవ చేస్తూ అందరికీ ఆపద్బాంధవుడుగా ఉంటూ, ఏటుర్ నాగారం మండల జడ్పిటిసి పదవిని సైతం త్యాగం చేసి ములుగు జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్న పార్టీ ఆదేశాల మేరకు పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండి నిస్వార్ధంగా సేవలు అందించడం జరిగిందని, గ్రామ మండల జిల్లా అభివృద్ధిలో తాను నిరంతరం భాగస్వాములు అవుతున్నారు గొప్ప నాయకులు కాకుల మరి లక్ష్మణ్ బాబు అందర్నీ కలుపుకొని పోయే మనసత్వం గల గొప్ప వ్యక్తి ములుగు జిల్లా అధ్యక్ష పదవి పై సీఎం కేసీఆర్ కేటీఆర్ లు ను అధిష్టానం ను ములుగు జిల్లా ప్రజానికం ములుగు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతల అప్పగించాలని ఆకాంక్షిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ప్రజా అభిప్రాయం మేరకు ములుగు జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాబుని ఎన్నిక చేస్తే జిల్లాలో పార్టీ మరింత శక్తివంతంగా తయారవుతుందని పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు.