పార్టీలకు అతీతంగా దళితులందరికి దళిత బంధు ఇవ్వాలి
-డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఐదు లక్షల సహాయం అందివ్వాలి
-సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే.శ్రీనివాస్
నిరుపేద దళితులు అందరికి పార్టీలకు అతీతంగా దళిత బంధు వర్తింప చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాకోడానికి ఐదు లక్షల సహాయం అందివ్వాలని సీసీపీ రాస్ట కమిటీ సభ్యుడు వైస్ ఎంపీపీ కట్టే బోయిన.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అర్హులైన్ దళితులకు దళిత బందు ఇవ్వాలని,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కులాలకు అతీతంగా ప్రతి పేద వానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందివ్వాలని కోరుతూ బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రెవిన్యూ కార్యాలయం ముందు మండల కమిటీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి,తహసీల్దార్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా కే.శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే దళిత బాండీ ఇవ్వాలని చూస్తున్నారని, చింతకాని మండలంలో మాదిరిగా పార్టీలకు అతీతంగా ప్రతి పేద దళితులకు దళిత బందు అందించి నట్టు గార్ల మండలంలో కూడా ఇవ్వాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించినట్లు గ్రామాలలో గూడు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాలు ఆర్థిక సహాయాన్ని అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు రాగం రమేష్, ధూపాటి జనార్ధన్, ధరావత్ వీరన్న, చిరుమర్తి నాగరాజు, మాగం లోకేష్, ఇరుగు వెంకటేష్, వెంకట్ నర్సమ్మ, కోటేశ్వరి, సరిత, వడ్లమూడి లక్ష్మి, బొడ్డు అర్జున్, మట్ల సీతారాములు, బాలమ్మ, నాగమ్మ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.




