మానవత్వాన్ని చాటిన రక్తదాతల సేవా సమితి నిర్వాహకుడు ముదాం శ్రీధర్ పటేల్
కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్21 (జనంసాక్షి);
మానవత్వాన్ని చాటిన రక్తదాతల సేవా సమితి నిర్వాహకుడు ముదాం శ్రీధర్ పటేల్ అభినందనలు తెలిపిన నిర్వహకులు.కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
కామారెడ్డి జిల్లా నందివాడ గ్రామానికి చెందిన అరుణ (28) కి అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడం వల్ల, భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రక్తదాతల సేవ సమితి ప్రతినిధి ముదాం శ్రీధర్ పటేల్ కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం చెశారు.నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలంటే ఎంతగానో ఆలోచించడం జరుగుతుందని అలాంటిది ఆపదలో ఉన్న వారి కోసం అడగగానే రక్తదానానికి ముందుకు వచ్చిన జిల్లా రక్తధాతల సేవా సమితి ప్రతినిధి ముదాం శ్రీధర్ పటేల్ కి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ అభినందనలు తెలిపారు.ప్రపంచంలో ఎన్నో రకాలైన దానాలున్నప్పటికీ రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని,డబ్బుతో సంబంధం లేకుండా చేయగలిగే సేవా కార్యక్రమం ఏది అంటే అది ఒక్క రక్తదానమనిఅన్నారు.ఈ కార్యక్రమంలో కొత్త నరేష్ పటేల్ మరియు వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఏసు గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.
మానవత్వాన్ని చాటిన రక్తదాతల సేవా సమితి నిర్వాహకుడు ముదాం శ్రీధర్ పటేల్




