ముధోల్ తాలూకాలో ప్రారంభమైన రాజకీయ ప్రైవేట్ సర్వేలు…
– గెలుపుఏవరిదో చెప్పలేని పరిస్థితి…
భైంసా రూరల్ డిసెంబర్ 21 జనం సాక్షి
ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల చూపు ప్రధానంగా ముధోల్ తాలూకా పైనే వుంది.ఇప్పటికే భాజపా రాష్ట్రా అధ్యక్షులు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా తాలూకా బిజెపి లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులతో తెరాస ముందుకు సాగగా ఈ రెండు పార్టీల మధ్యే తాలూకాలో ప్రధాన పోటీ ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తూన్నారు. కాంగ్రెస్ కూడా దూకుడు పెంచి తగ్గేదే లేదంటూ తాలూకాలో సామాజికవర్గం అధికంగా ఉన్నటువంటి నాయకులకు గాలం వేసే పనిలో పడింది.
గతవారం రోజుల క్రితం తాలూకాలోని ఏడు మండలాలలో రాష్ట్రా రాజనీతి స్ట్రాటజీ సర్వే తెరాస,భాజపా, కాంగ్రెస్,ఇతర పార్టీల పనితీరు…ఆ ఆ పార్టీ ల అభ్యర్థుల పై ప్రజల నుండి అభిప్రాయన్ని సేకరించారు. పార్టీలకు అనుకూల పరిస్థితులు,అననుకుల పరిస్థితులను ప్రజల నుండి తెలుసుకొన్నారు.ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం టిఆర్ఎస్, బిజెపి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని సమాచారం.తాలూకా లో ప్రస్తుతము టిఆర్ఎస్ నుండి విట్టల్ రెడ్డి ఎమ్మెల్యే గా కొనసాగగా…బిజెపి నుండి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పడక0టి రమాదేవి ఎమ్మెల్యే గా పోటిచేసి రెండోస్థానం లో నిలిచింది.2023 ఎన్నికలలో ఏ పార్టీ నుండి ఎవరు ఎమ్మెల్యే క్యాండేట్స్ అని తెలియకపోవడంతో సర్వేలో కొద్ది మేర ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం. మొత్తానికి సర్వేపూర్తి అయి నాలుగు రోజులు కాగా,అన్నీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. సర్వే రిపోర్ట్ ప్రస్తుతం గోప్యంగా ఉంచినట్టు సమాచారం.




