Thursday, 5 November 2026

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా

బోథ్ (జనంసాక్షి) నూతనంగా ఎన్నుకోబడిన బిఆర్ఎస్ పార్టీ బోథ్ మండల కన్వీనర్ గా దామెర్ల నారాయణరెడ్డి గారికి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోథ్ స్థానిక సర్పంచ్ గొర్ల సురేందర్ యాదవ్ గారు, జిల్లా కో ఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్ సలాం గారు, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సోలంకి సత్యనారాయణ గారు, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి గుండోజి రాజ్ కుమార్ గారు, కార్యకర్తలు కలీమ్, శేఖర్, సత్యనారాయణ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు బోథ్ శాసనసభ సభ్యులు రాథోడ్ బాపురావు గారికి ధన్యవాదాలు మరియు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నాయకులతో, కార్యకర్తలతో, కలిసి మెలిసి ఉంటూ ప్రజలకి పనిచేస్తానని అనడం జరిగింది.