వికారాబాద్ రూరల్ మే 27 జనం సాక్షి
వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లాలోని అన్ని గ్రామాల్లో బలోపేతం చేయడానికి గ్రామ కమిటీల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని వికారాబాద్ జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చర్యలు తీసుకుంటుందని జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ పేర్కొన్నారు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల ను ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంతో గ్రామస్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గస్థాయిలో పార్టీ కార్యకర్తలు కంకణం కట్టుకొని వీర సైనికుని వలె పనిచేసినప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతుందని అన్నారు వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూర్ స్థానాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ స్థాయిలో విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వికారాబాద్ ప్రాంతంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు ఈ సందర్భంగా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను ఆయన నియమించారు వైయస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా వేణుగోపాల్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షునిగా వీరేశం జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షునిగా వరప్రసాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంజలీనా రజిని జిల్లా అధికార ప్రతినిధులుగా సుదర్శన్ కావలి వసంత్ కుమార్ ఫరీదా బేగం నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షురాలు క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షునిగా అరవింద్ కీర్తి ధరూర్ మండల పార్టీ అధ్యక్షునిగా రత్నం ఉపాధ్యక్షుడిగా మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారిని నియామక పత్రాలు జిల్లా అధ్యక్షుని చేతులు మీదుగా అందజేశారు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఉప్పరి ప్రసాద్ ని జిల్లాలోని నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు రజిని పరిగి కోఆర్డినేటర్ మహమ్మద్ గౌస్ వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి వికారాబాద్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మోమిన్ పేట మండల నాయకులు సుకుమార్ రాజు యేసయ్య మహి ల విభాగం నాయకురాలు సుజాత పద్మ తోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నాయకులు పాల్గొన్నారు
పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్




