జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కూరగాయల, చికెన్ మార్కెట్ లను బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి శనివారం సందర్శించి వర్తకుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మంథని మున్సిపాలిటీ చేసిన అప్పటి నుండి మంథని ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. గ్రామపంచాయతీ ఉన్నపుడు మార్కెట్ గిరాకీ విపరీతంగా ఉండేది, మహిళలకు ఉపాధి అవకాశలు ఉండేవి, మంథని మున్సిపాలిటీ చేసి ఇళ్ల పర్మిషన్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.. ప్రజలకు ఎలాంటి న్యాయం చేయడం లేదని అన్నారు. ఉన్న ఒక మార్కెట్ పరిస్థితి చాల దారుణంగా తయారు అయిందని, ఏక్కడ చూసిన మురుగు నీరు, వ్యర్థ పదార్థాలు వేస్తున్నారని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్నారు. కనీసం చెత్తకుండీలు, డంపింగ్ యార్డ్ లేవు అని, ఈ వ్యర్థల వల్ల విపరీతంగా అంటు వ్యాధులు వస్తాయి దయచేసి ఎప్పటికైనా మార్కెట్లో అండర్ డ్రైనేజీ సిస్టమ్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, ముత్తారం మండల ఇంచార్జ్ పోతారవేని క్రాంతికుమార్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి పట్టణ ఉపఅధ్యక్షులు దాసరి శ్రవణ్, యువ నాయకులు ఎడ్ల సాగర్, పార్వతి విష్ణు, బుర్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ వల్ల మంథని కి ఎటువంటి మేలు జరగలేదు – బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి




