Wednesday, 4 November 2026

పూసల సమర శంఖారావం విజయవంతం చేయండి

జనంసాక్షి, మంథని : 28వ తేదీన ఆదివారం కరీంనగర్ లో జరగబోయే పూసల సమర శంఖారావం పూసల కులస్తులందరూ విజయవంతం చేయాలని పూసల కుల మహిళలందరూ గాజుల గంపలతో రావాలని పూసల సంఘం రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య, మంథని డివిజన్ అధ్యక్షుడు కావేటి సమ్మయ్య కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూసల కులని తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలో, కేంద్రంలో డిఎన్జీలో కలపాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పూసల సమర శంఖారావ సభకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాజీ మంత్రి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరవుతున్నారని వారు తెలిపారు. పూసల కులస్తులందరూ ఎంబీసీ, డిఎన్టి సాధనకై అధిక సంఖ్యలో పూసల కులస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూసల సమర శంఖారావం విజయవంతం చేయాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని పూసల సంఘం ప్రధాన కార్యదర్శి కావేరి శ్రీనివాస్, చేను రవి, గుంటుపల్లి గురువేష్, కావేటి రవి, మహిళలు కావేటి పద్మ, కావేటి రమ్య, కావేటి రాజేశ్వరి, గుంటుపల్లి పద్మ, ముద్ర కోల రాజ్యలక్ష్మి, చిన్న పెళ్లి కవిత, చిన్న పెళ్లి జమున, గుంటుపల్లి సమ్మక్క పాల్గొన్నారు.