Tuesday, 3 November 2026

ప్రమాదపు అంచుల్లో సింగరేణి–ఐఎన్టీయుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్

ప్రమాదపు అంచుల్లో సింగరేణి–ఐఎన్టీయుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్

25 వేల కోట్ల టర్నోవర్ దాటిన సంస్థ కొత్త బొగ్గు బావులు తీసే సత్తా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ప్రైవేటీకరణకు ద్వారాలు తీస్తున్నారు .
సింగరేణిలో ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాకులను కుట్ర పూరితంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారు.
ఈ నాలుగు బొగ్గు బ్లాక్ ల కోసం సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు ఖర్చుచేసింది
ముఖ్యమంత్రి తలచుకుంటే సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా చూడొచ్చు కాని కుట్రపూరితంగా కార్మికులను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు మద్దతు గా ఉన్నారని అన్నారు .
ఇప్పటికే అసలు అనుభవం లేని అరబిందో కంపెనీకి బొగ్గు బ్లాకులను అప్పజెప్పారని ఆ కంపెనీ కూడా రాష్ట్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన బందువులదే అని అన్నారు .
శాంతి ఖని బావి లో కూడా సగం పనులు కాంట్రాక్టు వాళ్లతో చేపిస్తున్నారని శాంతి గనిలో బొల్టర్ మైనింగ్ అనేది ఒక మోసపూరిత పద్ధతి అని దాదాపు ఇప్పటికీ నాలుగు సార్లు టెక్నాలజీని మార్చి న అది ఒక కొలిక్కి రాలేదని
గని నుంచి తీసిన బొగ్గు రవాణా చేయలేని పరిస్థితుల్లో శాంతి గని యాజమాన్యం ఉందని
సింగరేణి యాజమాన్యం సొంతంగా ఎస్ డి ఎల్ యంత్రాలను కొనుగోలు చేస్తే శాంతి ఖని బావి ఇంకా 40 సంవత్సరాలు నడిచే అవకాశం ఉందని దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్దం శెట్టి రాజమౌళి సెంట్రల్ జనరల్ సెక్రెటరీ కాంపెళ్ళీ సమ్మయ్య , సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ , మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య , ఏరియా సెక్రెటరీలు ఓదేలు ,చంద్రశేఖర్ , విక్రమ్ , ఆరేపల్లి రామయ్య , కనకయ్య , అనిల్ , మరియు పిట్ కార్యదర్శి శివ పాల్గొన్నారు .