..
ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం
జెడ్పిటిసి శ్రీనివాసరెడ్డి..
శంకరపట్నం: జనం సాక్షి జనవరి 25
ప్రతి పౌరుడు వృద్ధలు ఓటు హక్కును వినియోగించుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం శంకరపట్నం తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో, కన్నాపూర్ గ్రామంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని, ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ ను సన్మానించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట రమణారెడ్డి, రంజిత్ రావ్, ఎంపీటీసీ ఎస్ కె మోహన్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వీరస్వామి, వివిధ రాజకీయ పార్టీల మండల శాఖ అధ్యక్షులు, నాయకులు మహిపాల్, సమ్మయ్య, ఆరీష్ రాజిరెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ శ్రీధర్, ఆర్ఐ అరుణ, అంగన్వాడీ టీచర్లు గాజుల కాంత, కాటం రాజమణి, గ్రామస్తులు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి




