జనంసాక్షి :జూన్9(భువనగిరి రూరల్ )భువనగిరి మండలంఅనాజిపురంగ్రామలశ్శ్రీశ్రీకంఠమహేశ్వరస్వామిసూరమాంబదేవిల కళ్యాణం సందర్బంగా దేవ గౌడ స్వాములందరికీ విభూతి ధారణ, మాలాధారణ , జంజాధారణ, దీక్షా కంకణం, కుంకుమధారణ, చేయడం జరిగింది. అనంతరం గౌడ వారి ప్రతీ ఇంటింటా మహా మంగళహారతులు,జలబిందెలతో,పంచామృతాలతో, స్వామి వారికి అమ్మవారికి పంచామృతాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలు గౌడ పూజారులగు గౌడ జెట్టీలచే జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యం. పి. టి. సి ల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అనాజిపురం గ్రామ దేవ గౌడ కులం వారు పాల్గొనడం జరిగింది.సభ్యులు. పెద్ద గౌడ్,సారి గౌడ్ లు వెంకటేశం, మల్లయ్య గౌడ్, అధ్యక్షుడు నరసింహ గౌడ్, సభ్యులు బాలయ్య, రవీందర్, వెంకటేష్, దొరబాబు, నరహరి,బాల్ రాజ్, బాలకృష్ణ,బాను,నగెష్,శివ,సాయి గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వరస్వామి సురమాంభదేవి ల తృతీయ కళ్యాణం




