Wednesday, 4 November 2026

పార్లమెంట్‌ భవన్‌లో ఫ్లోర్‌ లీడర్ల సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల ఫ్లోర్‌ లీడర్ల సమావేశం ఆదివారం మధ్యాహ్నాం జరిగింది. పార్లమెంట్‌రీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖార్గే ఈ సమావేశంలో పాల్గొన్నారు. గందరగోళానికి అవకాశం ఇవ్వకుండా ఉభయ సభలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రభుత్వ పక్షం విపక్షాలను కోరినట్లు తెలియవచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *