Friday, 6 November 2026

పాలకుల నిర్లక్ష్యంతో గిరిజనుల వలసలు

పాలకుల నిర్లక్ష్యంతో గిరిజనుల వలసలు
ప్రగతి కోసం పాదయాత్రలో ఎల్లేని సుధాకర్ రావు
పానుగల్ డిసెంబర్ 19, జనం సాక్షి
ప్రస్తుత, గత పాలకుల నిర్లక్ష్య పాలనతో గిరిజనవాసులు వలసలు వెళ్లాల్సి వచ్చిందని బిజెపి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,నియోజకవర్గ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. ప్రగతి కోసం పాదయాత్రలో భాగంగా 12వ రోజు సోమవారం కిష్టాపూర్ తాండ,కిష్టాపూర్, రేమద్దుల గ్రామాలలో పాదయాత్రని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న తండాలలో ఇప్పటికీ మౌలిక వసతులు కరువయ్యాయని, కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో పాలకులు పాలన చేస్తున్నారని విమర్శించారు. తాజా,మాజీలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు.ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని, గిరిజనులు వలసలు వెళ్లకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొల్లాపూర్ కి రైలుమార్గం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అన్వేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధికారి ప్రతినిధి రోజా రమణి,ప్రధాన కార్యదర్శి రమేష్, నరేందర్ రెడ్డి, భాష,సుందర్ రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.