Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

 

 సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 26  : –

ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్ర లోని సోలాపూర్ పర్యటనకు రోడ్డు మార్గాన వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి  కేసీఆర్  కు సంగారెడ్డి కౌలంపేట వద్ద ప్లకార్డులు, బోనాలు మరియు బతుకమ్మలతో భారి ఎత్తున వెయ్యిల సంఖ్యలో కార్యకర్తలతో డి సి బి వైస్ చైర్మన్ పట్న మాణిక్యం  ఘన స్వాగతం పలికారు.పట్నం మాణిక్యం కు, మరియు కార్యకర్తలకు  సీఎం  కేసిఆర్  అభివాదం చేస్తూ తన కాన్వాయిలో వెళ్లారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట వందలాది వాహనాలు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ  కార్యక్రమం విజయవంతం చేసిన. నాయకులకు,కార్యకర్తలకు,అభిమానులకు,PMK యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.