పిట్టలగూడెం గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి
రాజాపేట ,డిసెంబర్5 ( జనం సాక్షి): రాజపేట మండల పరిధిలోని నెమిల గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన పిట్టలగూడెం గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేల సత్పతిని కలిసి వినతి పత్రం అందజేశారు. సుమారుగా 400 జనాభా కలిగియున్న 60 ఎస్టి కుటుంబాలు ఆవాసాలు ఏర్పరచుకొని జీవనం సంసాగిస్తున్న కుటుంబాలు రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల కాలంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళల శిషు మరణాలు సంభవించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ జోక్యం చేసుకొని పిట్టలగూడెం గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




