Wednesday, 4 November 2026

పిడుగురాళ్లలో వైసిపి నేతల అరెస్ట్‌

ఉద్రిక్తంగా పరిస్థితులు

గుంటూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని గురజాలలో మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల పిడుగురాళ్ల మున్సిపాలిటిలో ఇంటి పన్నులను పెంచడానికి నిరసనగా వైసిపి నేతలు మంగళవారం ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ రోజు ఉదయాన్నే వైసిపి గురజాల సమన్వయకర్త కాసు మహేశ్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పలువురు వైసిపి కార్యకర్తలను పోలీసులు నిన్న అర్థరాత్రి నుంచే అరెస్ట్‌ చేయడం ప్రారంభించారు. పోలీసుల చర్యపై వైసిపి శ్రేణులు మండిపడుతున్నాయి. నిరసన తెలపడం అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు అనీ, దాన్ని కూడా టిడిపి ప్రభుత్వం కాలరాస్తోందని వైసిపి నేతలు మండిపడ్డారు. తాజాగా పన్నులు పెంచడంతో పాటు వేసిన రోడ్లకే మరోసారి టెండర్‌ పిలుస్తున్నారనీ, ఇదేంటని ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారని వాపోయారు.