Wednesday, 4 November 2026

పిడుగు పడి గడ్డివాము దగ్ధం.

చిలప్ చేడ్/జూన్ /జనంసాక్షి :- చిలప్ చేడ్ మండల పరిధిలో ఆదివారం నాడు ఉరుములు మెరుపులతో కూడి విచిన భారీ ఈదురు గాలులకు గుజిరి తాండాలో పిడుగు పడి తండాకు చెందిన రామావత్ చంద్రియ తండ్రి బద్య కి చెందినటువంటి 100 వరి గడ్డి మోపుల వాము దగ్దం కావడం జరిగింది స్థానికులు సమీపంలోని ఆందోల్ ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగావారు వెంటనే సమాచారం తెలుసుకున్నా ఫైర్ సిబ్బంది అందోల్ నుండి వచ్చి మంటలను అదుపులోకి తేవడం జరిగింది అలాగే చిలప్ చెడ్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వారు ప్రమాద స్థలం వద్ద స్థానికులతో సమాచారం తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాకేష్ ఏఎస్ఐ మిస్బోద్దిన్ కానిస్టేబుల్ దేవిసింగ్ ఫైర్ సిబ్బంది వీరేశం,విఠల్,రామకృష్ణ పాల్గొన్నారు.