పిల్లలతో సహా బావిలోకి దూకి తల్లి ఆత్మహత్య

కుటుంబకలహాలే కారణమంటున్న బంధువులు

అమరావతి,జూన్‌13(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లా చెర్లోపల్లి కండ్రిగలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. మృతులను సరళ(25), దేవీశ్రీ(2), జ్యోత్స్న(4)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన చిత్తూరు గ్రావిూణ మండలం పేయనకండ్రిగలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సరళ భర్త, మామతో గొడవపడి తీవ్ర ఆవేదనకు గురై పిల్లలు దేవిశ్రీ(2), జ్యోత్స్న(4) తో కలిసి సవిూపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అత్తారింటి వేధింపులే సరళ మృతికి కారణమని బంధువులు ఆరోపించారు. గర్భవతిగా ఉన్న సరళపై మామ రాజేంద్ర దాడి చేసి గాయపరిచినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అవమాన భారం తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో పేయనకండ్రిగలో విషాదం చోటుచేసుకుంది. వారి మృతదేహాలు చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.