Tuesday, 3 November 2026

సహకార సిబ్బందికి వేతన సవరణ పట్ల కృతజ్ఞతలు

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి,ఏప్రిల్ 27( జనం సాక్షి): రాష్ట్ర సహకార సంఘములలో పనిచేయుచున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 44 (17-12-22) ప్రకారం సహకార సంఘం సిబ్బందికి ( హెచ్ ఆర్ సి పాలసీ ) మానవ వనరుల సమీకృత విధానములను సంఘములకు వర్తింపజేస్తూ ఇచ్చిన వేతన సవరణ ప్రకారం సంఘ సిబ్బందికి వేతనాలు పెరిగినందున బేతంపూడి సహకార పరపతి సంఘం సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం బేతంపూడి సొసైటీ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహకార అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, సిబ్బంది సహాయ సహకారాలతో జిల్లా సంఘం సిబ్బందికి హెచ్ఆర్ పాలసీ ఈ 44 జీవో ప్రకారం వేతన సవరణ ఉత్తర్వులను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలుపుతూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ వేతన సవరణకు  సహకరించిన తెలంగాణ రాష్ట్ర సహకార సంఘముల యూనియన్ హైదరాబాద్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రూప్సింగ్, రాష్ట్ర కార్యదర్శి బి శంకర్ గౌడ్, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు లంక నరసింహారావు, పొన్నోజు  ప్రేమాచారి, గౌరవ అధ్యక్షులు ఎస్ కే జిలాని, జిల్లా కార్యదర్శి సున్నం వెంకటేశ్వర్లు, కోశాధికారి రమణారెడ్డి, సభ్యులు కందుల వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.