Thursday, 5 November 2026

ముప్కాల్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

 

 

 

 

 

 

ముప్కాల్ (జనం సాక్షి) మార్చ్
బండి సంజయ్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని, వెంటనే ఎమ్మెల్సీ కవిత కు క్షమాపణ చెప్పాలని ముప్కాల్ మండల బిఆర్ యస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం గాంధీ వద్ద వారు చేపట్టిన దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం లో వారు మాట్లాడుతూ ఈడీ ని,మోడీని ఎదుర్కునే దమ్ము బిఆర్ యస్ పార్టీ కి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సామ వెంకట్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, టౌన్ అధ్యక్షులు పెంటు గంగాధర్, ఎంపీటీసీల సంఘం ఫోరం అధ్యక్షులు జోషి వెంకట్ రాజ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీ, కో అప్షన్ సభ్యులు, ఉప సర్పంచులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ శంకర్, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ నాయకులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు*