Saturday, 7 November 2026

పిల్లిగుండ్ల మాజీ సర్పంచ్ మృతి

పిల్లిగుండ్ల మాజీ సర్పంచ్ మృతి.

మర్పల్లి నవంబర్ 27 (జనంసాక్షి) మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామ మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య (70) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ఆదివారం రోజు కృష్ణయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్, నాయకులు రామేశ్వర్ రెడ్డి, జైపాల్, గోపాల్, నాగేష్, శ్రీనివాస్ తదితరులు.