Saturday, 7 November 2026

మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్*
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 27,
జనం సాక్షి :
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ ఆధ్వర్యంలో చైతన్య నగర్, పాత వాసవి హై స్కూల్ భవనంలో
ఉచిత మెగా హెల్ప్ క్యాంపు ఘనంగా నిర్వహించారు,
ఈ లయన్స్ క్లబ్ వారి ఉచిత మెగా హెల్ప్ క్యాంపులో డాక్టర్స్ డాక్టర్ ఆనంద్ బాబు, డాక్టర్ జంగిటి గంగాసాగర్, డాక్టర్ విద్యాసాగర్రావు, డాక్టర్ గంప శ్రీకాంత్ ,డాక్టర్ గడ్డం రమేష్, డాక్టర్ త్రిలోక్ కుమార్, డాక్టర్ మహేష్ ,డాక్టర్ మెరుగు మణిందర్ గౌడ్ ,డాక్టర్ నిర్మలరెడ్డి గార్లచే ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మెగా హెల్త్ క్యాంపు, ఉచిత గుండె చికిత్స క్యాంపు ,ఉచిత కంటి శిబిరములు, పలు ఉచిత క్యాంపులు ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తామని అన్నారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకు ముందు ఉంటుందని అన్నారు,
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కట్కం రాకేశ్ , క్లబ్ సెక్రటరీ లయన్ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి లయన్ ఇందూర్ రాకేష్, వడ్డేపల్లి శ్రీనివాసు, చర్లపల్లి రాజేశ్వర్గౌడ్ గడ్డం శంకర్ రెడ్డి , ప్రోహార్ తుకారాం, నాంపల్లి శ్రీనివాస్, మహాజన్ శివకుమార్ , దొంతుల రాజకుమార్, పవన్ కుమార్ , కోటగిరి తిరుమల చారి, నర్సింగారావు, నాంపల్లి చిన్న శ్రీనివాస్, దొంతుల ఆంజనేయులు ,చంద్రకాంత్ , గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.