Thursday, 5 November 2026

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గుల పోటీలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గుల పోటీలు

– మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలుగు సంస్కృతి , సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ప్రతీకలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంగోతు బావ్ సింగ్ , సంధ్య ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని అన్నారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.