పీఈటీ ఉద్యోగాల భర్తీకి చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు
కరీంనగర్: డీఎస్సీ ద్వారా త్వరలో రాష్ట్రంలో నాలుగు వేల పీఈటీ ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కరీంనగర్ మండలం కొత్తపల్లిలోని ఆల్ఫోర్ ఈ-టెక్నో పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో విజేతలకు ఆయన ఈరోజు బహుమతులను ప్రధానంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఏకాగ్రతను పెంచటంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు.జీవోఎంఎస్ 74 ద్వారా క్రీడాకారులకు రెండు శాతం రిజరేషన్ల కోటాను కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా విద్యాధికారి లింగయ్య , ఆల్ఫోర్ ఈ-టెక్నో పాఠశాల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.