శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2013లో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 25న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట (షార్) నుంచి పీఎన్‌ఎల్‌వీ – సి 20 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎన్‌ఎల్‌వీ-సి 20 వాహకనౌక ద్వారా భారత్ – ఫ్రాన్స్ సంయుక్త ప్రాజెక్టు సరళ్ ఉపగ్రహంతోపాటు మరో ఆరు వీదేశీ ఉపగ్రహాలను సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశ పెడతారు.
కౌంట్‌డౌన్‌లో మార్పు: ఇప్పటిదాకా జరిగిన రాకెట్ ప్రయోగాలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను 51 గంటలపాటు నిర్వహించారు. పీఎన్‌ఎల్‌వీ-సి20 వాహకనౌకకు మాత్రం59 గంటలపాటు కౌంట్‌డౌన్ ప్రక్రియ జరగనుంది. కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పును చేశారు.




