Wednesday, 4 November 2026

లారీ బీభత్సం..నలుగురి మృతి

పుల్కల్‌: మెదక్‌ జిల్లాలో ఓ లారీ అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. నాందేడ్‌- అకోలా రహదారిపై పుల్కల్‌ మండలం న్యూఉన్నాపూర్‌ వద్ద లారీ అదుపుతప్పి ఆటోను అనంతరం మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సంగారెడ్డి నుంచి జోగిపేటకు వస్తున్న ఆటోను లారీ అదుపుతప్పి ఢీకొనడంతో ఆందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే లారీ అక్కడి నుంచి అరకిలోమీటర్‌ ముందుకెళ్లి మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మరొకరు మృతి చెందారు. రెండు ప్రమాదాలకు కారణమైన లారీ డ్రైవర్‌ వాహనంతో సహా పరారయ్యాడు. అయితే ఘటన స్థలంలో లారీ నెంబర్‌  ప్లేట్‌ పడిపోయింది. దాని ఆధారంగా నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *