శ్రీహరికోట, న్యూస్‌టుడే: శ్రీహరికోట మొదటి ప్రయోగ వేదిక నుంచి జులై 1న పీఎస్ ఎల్‌వీ-సీ 22 వాహకనౌకను రోదసీలోకి పంపేలా ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. శనివారం ఉదయం 7.41 గంటల నుంచి కౌంట్‌డౌన్ సాగుతుంది.64 గంటల నిరంతరాయ కౌంట్‌డౌన్ తర్వాత జులై 1 రాత్రి 11.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 22 నింగికెగురుతుంది. బ్రహ్మప్రకాష్ హాలులో సంచాలకులు ఎంవైఎస్ ప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ కున్హికృష్ణన్ ఆధ్వర్యాన మిషన్ రెడీనన్ సమీక్ష గురువారం జరిగింది.




