Thursday, 5 November 2026

పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు – కొనుగోలు కేంద్రం ప్రారంబించిన పిఎసియస్ చైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్

హుజూర్ నగర్ ఏప్రిల్ 12 (జనం సాక్షి): రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్మాలని పిఎసిఎస్ ఛైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్ ఆన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణం లోని వేపల సింగారం రోడ్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రైతులు దళారీల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఉపాధ్యక్షులు కంచర్ల మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు జక్కుల మల్లమ్మ, దేవరం మల్లేశ్వరి, మీసాల శ్యాంసుందర్, ,కటారి శ్రీను, జక్కుల నరేందర్, గోసుల శ్రీను, రాయల వెంకటేశ్వర్లు, భూక్యా లచ్చిరాం నాయక్, దుగ్గి బ్రహ్మం, సెక్రెటరీ నరేందర్ రెడ్డి, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.